: మొబైల్స్ దొంగిలించారని ఇద్దరిని నగ్నంగా పరుగెత్తించారు


గోవాలోని బీటుల్ లో ఓ అల్లరి మూక ఇద్దరి పట్ల అమానవీయంగా వ్యవహరించింది. విదేశీయులకు సంబంధించిన మొబైల్స్, ఇతర వస్తువులను దొంగింలించారనే అనుమానంతో ఇద్దరిని స్థానికులు పట్టుకుని కర్రలతో కొట్టారు. ఆ తర్వాత కొందరు ఆ ఇద్దరిని బట్టలు ఊడదీయించి తమ ద్విచక్ర వాహనాలకు తాడుతో కట్టి పరుగెత్తించారు. ఇది గత నెల 22నే జరిగినా ఆలస్యంగా వెలుగు చూసింది. మొబైల్స్ దొంగిలించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. స్థానికులపై కూడా మరో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News