: మీ ఆటలు మా దగ్గర సాగవు
బీజేపీ నేతలపై సీబీఐ దాడులు, విచారణకు తెర లేపుతున్న కాంగ్రెస్ బెదిరింపు క్రీడలు తమ ముందు సాగబోవని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ కటువుగా వ్యాఖ్యానించారు. తమ నేతలను వేధించేందుకు సీబీఐని కాంగ్రెస్ ఓ పావులా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. సీబీఐని చూసి తాము భయపడబోమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పనిలోపనిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజా ప్రసంగంపై మోడీ పెదవి విరిచారు. సీఐఐలో నిన్న రాహుల్ దేశ భవిత అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉపన్యాసంపై మోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్ కు భారతదేశం ఓ తేనెపట్టులాంటిదని, దాన్ని జుర్రుకోవడానికే అది ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. తమకు దేశం ఓ తల్లిలాంటిదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమని మోడీ స్పష్టం చేశారు.