: వైఎస్సార్సీపీ నేటి నుంచి జాతీయ పార్టీ: జగన్
వైఎస్సార్సీపీ నేటి నుంచి జాతీయ పార్టీగా మారిందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలిపారు. హైదరాబాదులోని లోటస్ పాండులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విడదీసినా తెలుగు ప్రజలను వేరు చేయలేరని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని జగన్ తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని ఏ ముఖ్యమంత్రి అభివృద్ధి చేయనంతగా వైఎస్సార్ అభివృద్ధి చేశారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్సార్ కి ప్రత్యేక స్థానం ఉందని జగన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ కు జగన్ అభినందనలు తెలిపారు.