: స్కూల్ విద్యార్థినిపై తోటి విద్యార్థుల అత్యాచారం
ఆరవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారం చేసిన ఘటన పశ్చిమబెంగాల్లోని బీర్భమ్ జిల్లాలో జరిగింది. ఆడుకోవడానికి వెళ్లిన అమెను ముఖానికి గుడ్డ చుట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఓ చెరువు దగ్గరకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. వారు అదే స్కూల్ విద్యార్థులని తేలింది. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు.