: కరాచీలో దారుణం... ఏడుగురిని చిత్రహింసలు పెట్టి చంపేశారు


పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. గుర్తు తెలియని ఏడుగురు వ్యక్తులను అత్యంత దారుణంగా చంపేశారు. వారి తల, ఛాతీ భాగంలో తుపాకితో కాల్చారు. అంతేకాదు, చంపే సమయంలో వారి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసినట్టు గుర్తులు ఉన్నాయి. వారిని చిత్ర హింసలు పెట్టినట్టు శరీరాలపై గాట్లు ఉన్నాయి. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News