: సచివాలయానికి చేరుకున్న కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అడుగు పెట్టిన కేసీఆర్ కు బతుకమ్మ, బోనాలతో తెలంగాణ ఉద్యోగులు స్వాగతం పలికారు. సచివాలయంలోని నల్లపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహించారు.