: మామిడి కాయల కోసం భారత్ కు ఈయూ నిపుణులు


యూరోపియన్ యూనియన్ (ఈయూ) కు చెందిన శాస్త్రవేత్తల బృందం త్వరలో భారత్ లో పర్యటించనుంది. అల్ఫోన్సో రకం మామిడి కాయలు భారత్ నుంచి దిగుమతి చేసుకోకుండా గత నెల నుంచి ఈయూ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. భారత్ నుంచి దిగుమతైన మామిడి కాయల్లో హానికారక బ్యాక్టీరియా ఉన్నట్లు బయటపడడంతో ఈ చర్య తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ ఈయూ వ్యవసాయ, వాణిజ్య విభాగం కమిషనర్లను కలసి భారత్ లో పర్యటించాలని ఆహ్వానించారు. ఈ సమస్యను నేరుగా భారత ప్రభుత్వంతోనే పరిష్కరించుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అత్యున్నత స్థాయి నిపుణుల బృందం సెప్టెంబర్ లో భారత్ లో పర్యటించి నిషేధం ఎత్తివేయడానికి వీలుగా తీసుకున్న చర్యలను పరిశీలించనుంది.

  • Loading...

More Telugu News