: నటకిరీటికి కెనడాలో సన్మానం
కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో విలక్షణ పాత్రలతో తనదైన శైలిలో అలరిస్తున్న నటుడు 'నటకిరీటి' రాజేంద్ర ప్రసాద్. రేపు సాయంత్రం ఆయనను సన్మానించాలని కెనడాలోని తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా (తాకా) సంఘం నిర్ణయించింది. తాజాగా ఆయన నటించిన చిత్రం 'డ్రీమ్'..కెనడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'రాయల్ రీల్' అవార్డుకు ఎంపికైంది. ఆ అవార్డు అందుకునేందుకు ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ కెనడాలోనే ఉన్నాడు. దాదాపు 50 దేశాల సినిమాలు ప్రదర్శితమైన ఈ చిత్రోత్సవంలో రాజేంద్రప్రసాద్ నటించిన సినిమాకు అవార్డు దక్కడం పట్ల 'తాకా' ఆనందం వ్యక్తం చేసింది.