: గాంధీభవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాదులోని గాంధీభవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ... ఎన్ని అడ్డంకులు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు.