: కుమ్మక్కై రఘువీరా కాంగ్రెసు ను ఓడించారు: జేసీ ప్రభాకర్
టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరాపై మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ తో రఘువీరా కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించారని ఆరోపించారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేసింది రఘువీరాయేనన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రబాబును అడిగే హక్కు రఘువీరాకు లేదన్నారు.