: కోదండ రాముడికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం


తిరుపతిలోని శ్రీకోదండ రాముని ఆలయంలో ఆదివారం నాడు పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం సీతారాముల ఉత్సవ మూర్తులకు తులసి, చామంతి, మల్లె, జాజి, సంపంగి, రోజా వంటి 16 రకాల పుష్పాలతో అభిషేకించారు. అనంతరం సీతారామ లక్ష్మణ సమేత కోదండరామ స్వామి మాడవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోదండరాముడిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News