: కేసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కు, ఆయన మంత్రి వర్గ సహచరులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాతే తెలంగాణలో నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి, కొత్తకోట దయాకర్ రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి, ఎంపీ మల్లారెడ్డి, పి.రాములు, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.