: ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభించిన చంద్రబాబు
టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పలువులు టీడీపీ నేతలు నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండాను, టీడీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. టీడీపీ జెండాలో పార్టీ గుర్తుతో పాటు తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని కూడా ముద్రించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చే దిశగా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. కార్యక్రమం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు తెలంగాణ పాటలు పాడారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్ అనే నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది.