: కేసీఆర్ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం: మోడీ
తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ట్విట్టర్ లో మోడీ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావాన్ని స్వాగతిస్తున్నానని... అమర వీరులకు నివాళి అర్పిస్తున్నానని వెల్లడించారు.