: వివాదానికి ముగింపు... హాజరైన కోదండరాం
టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం రాజ్ భవన్ చేరుకున్నారు. కోదండరాంను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించలేదనే వార్తలు హల్ చల్ చేశాయి. కావాలనే కోదండరాంను విస్మరించారని... వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ కోదండరాం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. అయితే, కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారా?... లేక ప్రభుత్వం తరపున అందిన ఆహ్వానం మేరకు ఆయన వచ్చారా? అనే విషయంపై క్లారిటీ లేదు.