: చంద్రబాబును స్వయంగా ఆహ్వానించడం కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నాం: టీటీడీపీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారా? లేదా? అనే విషయంలో ఇంకా సంధిగ్దత నెలకొనే ఉంది. ప్రభుత్వం తరపున చంద్రబాబుకు ఆహ్వానం అందిందని సమాచారం. అయితే, తమ అధినేత చంద్రబాబుకు గాని, తమకు గాని కేసీఆర్ నుంచి వ్యక్తిగతంగా ఆహ్వానం అందలేదని టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, ఎల్.రమణ తెలిపారు. ఆహ్వానిస్తారా? లేదా? అన్నది కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.