: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జాతీయ జెండా, టీడీపీ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన తెలంగాణ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా, తెలంగాణ అమరవీరులకు టీటీడీపీ నేతలు అంజలి ఘటించనున్నారు. దీనికి సంబంధించి కాసేపటి క్రితం టీటీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో టీడీపీ తరపున ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా టీటీడీపీ నేతలు తెలిపారు.