: విశాఖలో 300 కిలోల గంజాయి స్వాధీనం
గంజాయి అక్రమ సాగు, రవాణా అడ్డు, అదుపు లేకుండా సాగిపోతోంది. ఇందుకు నిదర్శనంగా ఈ రోజు విశాఖలో 300 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో అధికారులు దాడి చేసి 20 బస్తాల్లో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో మహారాష్ట్రకు తరలించడానికి సిద్ధంగా ఉన్న గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు మహిళలతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, అరకు మండలాల్లో సాగు చేసిన ఈ గంజాయిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు తరలించబోతున్నట్లు సమాచారం.