: లండన్ లో మేయర్ గా ఎన్నికైన ఎన్నారై
లండన్ లోని సౌత్ వార్క్ నగరానికి మేయర్ గా సునీల్ చోప్రా అనే ఎన్నారై ఎన్నికయ్యారు. సౌత్ వార్క్ కు ఎన్నికైన తొలి ఎన్నారైగా ఆయన చరిత్రపుటల్లోకి ఎక్కారు. జూన్ 7న ఆయన మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో చోప్రా డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. లండన్ లోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శిగా కూడా చోప్రా పనిచేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన చోప్రా... ఢిల్లీ యూనివర్శిటీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.