: రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రేపు (సోమవారం) ఉదయం 8.15 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు సీపీ అనురాగశర్మ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్ బీహెచ్ క్రాస్ రోడ్స్ నుంచి బేగంపేట మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్ళించనున్నారు. బేగంపేట మీదుగా వెళ్లే వాహనాలు ప్యాట్నీ, ప్యారడైజ్, టివోలీ వైపునకు మళ్ళించనున్నారు. సీటీవో క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను పరేడ్ గ్రౌండ్స్ వైపు అనుమతించరు. ఇక తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు 16 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్టు సీపీ వెల్లడించారు.