: 'హైకోర్టు ఆఫ్ హైదరాబాద్'గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
'హైకోర్టు ఆఫ్ హైదరాబాద్'గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఇక నుంచి హైదరాబాద్ హైకోర్టు వ్యవహరించనుంది. అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి హైకోర్టులో ప్రవేశానికి గుర్తింపు కార్డులు, అనుమతి పత్రాలు తప్పనిసరి. హైకోర్టు న్యాయవాదులు మినహా ఇతరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.