: రాజముద్రలో అమరవీరుల స్థూపం లేకపోవడం దారుణం: తెలంగాణ బీజేపీ
తెలంగాణ రాష్ట్రానికి ఎంపిక చేసిన రాజముద్రలో అమరవీరుల స్థూపాన్ని విస్మరించారని తెలంగాణ బీజేపీ కార్యదర్శి ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర వెలకట్టలేనిదని... వారిని విస్మరించడం అత్యంత దారుణమని ఆయన నిప్పులు చెరిగారు. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచే తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరుగుతాయని... 2వ తేదీన అన్ని గ్రామాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో జెండా వందన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.