: కోటి రూపాయలకు స్కెచ్ వేసిన గ్యాంగ్... పోలీసుల చేతికి చిక్కింది


సుపారీ ముఠాను విజయవాడ పోలీసులు ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ కమిషనరేట్, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ముఠాను అరెస్ట్ చేశామని చెప్పారు. ముఠాలో తొమ్మిది మంది సభ్యులున్నట్లు పోలీసులు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన రామానుజం అలియాస్ శ్రీరామ్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వీరు జైన్ అనే బంగారం వ్యాపారి నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారని చెప్పారు. ఆ మొత్తం ఇవ్వడానికి అతను అంగీకరించకపోవడంతో శ్రీరామ్, చింతా రాకేష్ కలిసి ఆయనను కిడ్నాప్ చేసేందుకు పథకం వేశారని, వారి కుట్రను భగ్నం చేశామని పోలీసులు చెప్పారు. కిడ్నాప్ చేసి కోటి రూపాయలు సంపాదించేందుకు వీరు ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. వీరి నుంచి ఓ డమ్మీ పిస్టల్, రెండు కత్తులు, బేడీలతో పాటు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని, రెండు కార్లను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News