: తెలంగాణకు కేటాయించిన విద్యుత్ ను తగ్గించరాదు: చంద్రబాబు
ఏపీకి తక్కువగా విద్యుత్ ను కేటాయించినందున ఎన్టీపీసీ నుంచి ఆ లోటును భర్తీ చేయాలని... తెలంగాణకు కేటాయించిన విద్యుత్ ను తగ్గించకుండానే సీమాంధ్రకు న్యాయం చేయాలని ప్రధాని మోడీని కోరినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని సమస్యల పరిష్కారానికి పలుమార్లు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. నిన్న ఢిల్లీలో మోడీ సహా 11 మంది కేంద్ర మంత్రులను కలిశానని... తమ డిమాండ్ల పట్ల అందరూ సానుకూలంగా స్పందించారని తెలిపారు.