: ప్రధాని, కేసీఆర్ కు పొన్నాల లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య లేఖలు రాశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పేరు మార్చవద్దని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ కు రాసిన లేఖలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని పొన్నాల విజ్ఞప్తి చేశారు.