: తెలంగాణలో పార్టీని బలోపేతం చేయండి: జగన్
తెలంగాణ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం ముగిసింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, తెలంగాణలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.