: ఎయిడ్స్ మీద దండెత్తిన హాలీవుడ్ తారామణులు
ఎయిడ్స్ మహమ్మారి మీద హాలీవుడ్ తారామణులు దండెత్తారు. ఇవాళ బ్రెజిల్ లోని సావోపోలో లో జరిగిన ఎయిడ్స్ పరిశోధన కార్యక్రమంలో సందడి చేశారు. క్యాట్ వాక్ చేస్తూ ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేలా కథంతొక్కారు. రకరకాల దుస్తులు ధరించి, ర్యాంప్ పై వివిధ భంగిమలతో క్యాట్ వాక్ చేశారు. ఎయిడ్స్ నివారణ ప్రాముఖ్యాన్ని చాటారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం పీలే తన భార్య మెర్సియాతో కలిసి హాజరై నవ్వులు కురిపించారు.