: రజనీ, సచిన్, కమల్ పట్టభద్రులేం కాదు: ఖుష్బూ
దక్షిణాది నటి ఖుష్బూ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మద్దతుగా నిలిచారు. డిగ్రీ కూడా లేని స్మృతి ఇరానీకి కీలకమైన మానవవనరుల శాఖ కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం తెలిసిందే. దీనిపై ఖుష్బూ స్పందిస్తూ సాధించడానికి ప్రతిభ ముఖ్యంగాని, విద్యార్హతలు కాదన్నారు. సచిన్ టెండుల్కర్, కమల్ హాసన్, రజనీకాంత్, బిల్ గేట్స్ పట్టభద్రులు కాదని ఉదాహరణ చెప్పారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సాధించిన విజయాలను కూడా ఆమె ప్రశంసించారు.