: చైనాలో భూకంపం... 20 వేల ఇళ్లకు నష్టం
చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో మధ్య స్థాయి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో వచ్చిన దీని ధాటికి 43 మందికి గాయాలయ్యాయి. ప్రావిన్స్ పరిధిలో 20 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, సుమారు లక్షన్నర మంది నిరాశ్రయులయ్యారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.