: వయసు పెరిగినా వన్నె తగ్గని 'వాల్'


ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వయసు పెరిగినా వన్నె తగ్గని కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తనలో ఇంకా పరుగుల దాహం తీరలేదని చాటుకున్నాడు. కేవలం 51 బంతుల్లో 65 పరుగులు చేశాడు. వాటిలో 6 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. కాగా, ఢిల్లీ పేసర్ ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. చివర్లో రాయల్స్ జట్టు వేగంగా వికెట్లను చేజార్చుకుంది. లేకుంటే స్కోరు మరింత పెరిగేది!

  • Loading...

More Telugu News