: ప్రధాని కాన్వాయ్ లో విదేశీ కార్లవైపే మొగ్గు చూపిన మోడీ


ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోడీ ఉపయోగించే కాన్వాయ్ స్వదేశీనా? లేక విదేశీనా? అన్న ఉత్కంఠకు తెరపడింది. మోడీ తొలిసారిగా ప్రధాని కార్యాలయానికి బీఎమ్ డబ్ల్యూ 7-సిరీస్ కారులో కాన్వాయ్ తో పాటు వచ్చారు. దీంతో ఆయన విదేశీ కాన్వాయ్ కే ప్రాధాన్యతనిచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి నరేంద్ర మోడీ మేడ్ ఇన్ ఇండియా సాయుధ స్కార్పియో వాహనాలనే కాన్వాయ్ గా ఉపయోగిస్తారని అందరూ అనుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఈ మేరకు ప్రధాని భద్రతా అవసరాలకు అనుగుణంగా తమ కార్లను కాన్వాయ్ గా చేసి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే, పలు భద్రతా కారణాల వల్ల భారత ప్రధానికి కేటాయించే అధికారిక కాన్వాయ్ నే నూతన ప్రధాని నరేంద్ర మోడీకి కేటాయించారు. ఇదివరకు ప్రధాని కాన్వాయ్ తో అంబాసిడర్ కార్లు ఉండేవి. అయితే, 2004లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అంబాసిడర్ స్థానంలో బీఎమ్ డబ్ల్యూ వాహనాలను కాన్వాయ్ లో ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News