: ఢిల్లీలో హోరున గాలి, జోరుగా వాన.. పైగా చిమ్మచీకటి!
ఢిల్లీలో బీభత్సమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దేశ రాజధానిలో ఒక్కసారిగా గాలిదుమారం చెలరేగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సాయంత్రం ఈదురుగాలులతో పాటు వర్షం పడటంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో అంధకారం నెలకొంది.