: ముగిసిన రాజ్యసభ సభ్యుల లాటరీ... ఏపీకి దేవేందర్ గౌడ్, కేకే, రేణుకాచౌదరి


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాజ్యసభ సభ్యుల పంపిణీ పూర్తయింది. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ లాటరీ పద్ధతిలో సభ్యులను రెండు ప్రాంతాలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు 11 మంది, తెలంగాణకు 7 మంది రాజ్యసభ సభ్యులను కేటాయించారు. అయితే నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఇటీవలే మరణించడంతో సీమాంధ్ర ప్రాంతంలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. లాటరీలో ఊహించని విధంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఎం.ఏ. ఖాన్, రేణుకాచౌదరి, టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు, టీడీపీ సభ్యుడు దేవేందర్ గౌడ్ లు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులుగా తేలారు. వీరితో పాటు జైరాం రమేష్, సుజనా చౌదరి, టి.సుబ్బరామిరెడ్డి, చిరంజీవి, జేడీ శీలం, సీతామహాలక్ష్మిలు ఏపీకి ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News