: ప్రధాని నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు సొరంగమార్గం రెడీ
ప్రధాన మంత్రి నివాసం నుంచి ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ విమానాశ్రయానికి ఏకంగా ఓ సొరంగ మార్గాన్నే నిర్మించేశారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు దాదాపుగా పూర్తయింది. భారత ప్రధాని తరచుగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో, విమానాశ్రయానికి వెళ్లడం కోసం ఈ సొరంగాన్ని నిర్మించారు. దీంతో, ప్రధానికి భద్రత పెరగడంతో పాటు... ప్రజలకు ట్రాఫిక్ జామ్ సమస్య తప్పుతుంది. సొరంగ మార్గం ద్వారా సఫ్దర్ జంగ్ విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని అక్కడ నుంచి హెలికాప్టర్ లో కావాల్సిన చోటుకు బయల్దేరుతారు.