: కేసీఆర్ ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చిందనడం సరికాదు: పొన్నం


14 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందని అనడం సరికాదని... ప్రజల ఆకాంక్షను గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ రోజు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో తమ తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలయిందని అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిన విషయాన్ని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. పోలవరం ఆర్టినెన్స్ విషయంలో టీఆర్ఎస్ తీసుకునే నిర్ణయానికి తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News