: మరో రెండు రైళ్లలో దోపిడీలు


రాష్ట్రంలో రైలు దోపిడీలు పెరిగిపోతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటుండడంతో దొంగల ఆగడాలకు తెరపడడం లేదు. చెన్నై-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లో వరుసగా రెండు రోజులు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. బుధవారం రాత్రి మూడు కోచ్ లలో దోపిడీ చేయగా, నిన్న రాత్రి కూడా అదే రైలులో గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో ఓ మహిళ మెడలో నగలు లాక్కుని పరారయ్యారు. ఇక, తిరుపతి-సికింద్రాబాద్ రైలులోనూ ప్రయాణికులను దోచుకున్నారు. నిన్న రాత్రి అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి రాగానే ఎస్-6, 7, 8, 9 బోగీల్లో ప్రయాణికుల నుంచి ఆభరణాలు, నగదు దోచుకుని పరారయ్యారు.

  • Loading...

More Telugu News