: జమ్మూలో ఠారెత్తిస్తున్న ఎండలు
హిమాలయాలు కొలువైన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. వేసవిలో అక్కడ చల్లగా ఉంటుందని అనుకుంటాం. కానీ, ఒక్కసారి ఈ వేసవిలో జమ్మూకి వెళ్లి చూస్తే 'అయ్య బాబోయ్ మన హైదరాబాదే నయమంటారు'. ఎందుకంటే నిన్న జమ్మూలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇదే గరిష్ఠ ఉష్ణోగ్రత. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది.