: ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడికి 12 ఏళ్ల జైలు
ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు జమిల్ మహౌద్ కు అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీలో మహౌద్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 1998 నుంచి 2000 వరకు ఈక్వెడార్ కు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజాగ్రహానికి తోడు సైనిక తిరుగుబాటు జరగడంతో 2000లో ఆయన అధికారం నుంచి తప్పుకున్నారు.