: దేవుడి హుండీని సైతం దోచేశారు!
దొంగలు ఆలయంలోని దేవుడి హుండీని సైతం వదలడం లేదు. హైదరాబాదులోని రామంతాపూర్, నేతాజీనగర్ సాయిబాబా ఆలయంలోని హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతోపాటు సాయిబాబా కిరీటం, వెండి నగలను కూడా వారు దోచుకుపోయారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.