: కర్ణాటక నుంచి రాజ్యసభకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్రమంత్రి (స్వతంత్ర హోదా)గా పదవీ బాధ్యతలను చేపట్టిన నిర్మలా సీతారామన్ ను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా చర్యలను చేపట్టింది. రానున్న రోజుల్లో కర్ణాటకలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఒక్కో ఎంపీ ఎంపికకు 44 మంది ఎమ్మెల్యేలు అవసరం. బీజేపీకి 43 సీట్లు ఉన్నాయి. దీంతో ఇతరుల సహకారంతో నిర్మలను కర్ణాటక నుంచి రాజ్యసభ బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోంది.