: నేడు రాష్ట్రానికి రానున్న వెంకయ్య... అధికారిక కార్యక్రమాలకు శ్రీకారం


కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆయన నేరుగా తిరుపతి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అయి తిరుపతిలోనే బస చేస్తారు. రేపు ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకుని హైదరాబాద్ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా బీజేపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం లేక్ వ్యూ అతిథి గృహానికి చేరుకుని... పలు అధికారిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

  • Loading...

More Telugu News