: వైసీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ పార్టీకి 'ఫ్యాన్ గుర్తు' కేటాయిస్తూ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల కిందటే వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. దాంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైసీపీ కూడా చేరింది.