: ఆంధ్రాకు కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తా: విఠల్


ఉద్యోగుల సర్దుబాటులో భాగంగా తన సర్వీసును ఏపీకి కేటాయిస్తే తక్షణం ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ హెచ్చరించారు. హైదరాబాద్ లో సీఎస్ ని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన తనను ఆంధ్రప్రదేశ్ కు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. తనను ఏపీకి కేటాయించొద్దని సీఎస్ కు విజ్ఞప్తి చేశానని అన్నారు. దానికి సీఎస్ కాస్త ఓపిక పట్టాలని సూచించారని విఠల్ తెలిపారు.

  • Loading...

More Telugu News