: ఎర్రచందనం స్మగ్లర్ల తీరు మారకపోతే కఠిన చర్యలు: ఎస్పీ
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు దాడులు చేయడం వల్లే కాల్పులు జరిపామని, స్మగ్లర్ల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయని అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారని ఆయన తెలిపారు. కూంబింగ్ సమయంలో స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడులకు దిగారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో పలువురు స్మగ్లర్లు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ల తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.