: అబ్బే... సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరి మాత్రం మారలేదు: మోత్కుపల్లి


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఎప్పడూ విరుచుకుపడే టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఆయన్ను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నప్పటికీ... కేసీఆర్ ప్రవర్తన, వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. పదవికి తగ్గ హుందాతనం ఆయనలో రాలేదని సెటైర్ విసిరారు. పోలవరంపై ఆర్డినెన్స్ అనేది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. బంద్ లతో కేసీఆర్ మరోసారి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మంచి పద్దతి కాదని అన్నారు.

  • Loading...

More Telugu News