: శ్రీలక్ష్మి ఆనాడే చెప్పారు.. అయినా కేవీపీని వదిలిపెడుతున్నారు : టీడీపీ


రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అక్రమాలతోనూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు సంబంధం ఉందని ఆనాడు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మే చెప్పారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అయినా కేవీపీని అరెస్టు చేయడంలో ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఆనాడు పలు విషయాల్లో తమ వారికి న్యాయం చేయాలంటూ కేవీపీ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని శ్రీలక్ష్మీ వివరించారని గుర్తు చేశారు.

అయినా సీబీఐ కేవలం విచారణ చేసి వదిలేసి, ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. టీడీపీ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ధూళిపాళ్ల.. కేవీపీ, రఘురామరాజు వంటివారు బయటే ఉంటే కేసుల్లో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా రఘురామరాజును అరెస్టు చేసి విచారిస్తే కేవీపీ అసలు బండారం బయటపడతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News