: మండు వేసవిలో చిరుజల్లులు కురిశాయ్
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వేసవి కాలంలో మండే ఎండలతో అల్లాడుతున్న నగర వాసులు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊరట చెందారు. అమీర్ పేట, ఖైరతాబాద్, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.