: రాజస్థాన్ లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా


రాజస్థాన్ అసెంబ్లీకి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వారు ముగ్గురూ ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో వారు ముగ్గురూ తమ ఎమ్మెల్యే పదవులను వదులుకున్నారు. కోట లోక్ సభ స్థానం నుంచి ఓం బిర్లా, భరత్ పూర్ లోక్ సభ స్థానం నుంచి భహదూర్ కోలి, ఝున్ ఝును లోక్ సభ స్థానం నుంచి సంతోష్ అహ్లావత్ ఎంపీలుగా విజయం సాధించారు. దీంతో వారు ముగ్గురూ రాజీనామా పత్రాలను రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్ కు సమర్పించారు.

  • Loading...

More Telugu News