: కాళ్లనొప్పులు తప్ప చంద్రబాబు సాధించేది శూన్యం: జేసీ దివాకర్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర వృధా ప్రయాస అని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. పాదయాత్రతో చంద్రబాబుకి కాళ్లనొప్పులు ప్రాప్తించడం తప్ప, సాధించేది మాత్రం శూన్యమని తనదైన శైలిలో జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించాలని సూచించారు. అప్పుడే రాజకీయాల్లోకి సమర్థత ఉన్న కొత్తరక్తం వస్తుందని జేసీ అభిప్రాయపడ్డారు.