: టికెట్ తీసుకోలేదని మహిళను రైల్లోంచి తోసేసిన టీసీ
మహారాష్ట్రలోని జల్ గావ్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. టికెట్ తీసుకోలేదని టీసీ ఓ మహిళను ప్రయాణిస్తున్న రైల్లోంచి తోసేశాడు. కింద పడిన ఆమె, అక్కడికక్కడ మృతి చెందింది. దీంతో ప్రయాణికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. టీసీని పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగించారు.